Telugu Euangelion

#BIbleProject #TeluguBibleVideos

దేవుని స్వభావం: నమ్మకత్వం Faithfulness

బైబిల్లో దేవుణ్ణి వర్ణించడానికి సాధారణంగా వాడే ఒక పదం ఎమెట్. దానిని “నమ్మకత్వం” లేక “సత్యం” అని అనువదించవచ్చు. కాబట్టి బైబిలు రచయితలు దేవుడు “ఎమెట్ తో నిండి ఉన్నవాడు” అని చెప్పినప్పుడు ఆయన నమ్మదగినవాడు, విశ్వాసపాత్రుడు, కనుక మనం ఆయన్ని నమ్మవచ్చు అని చెబుతున్నారన్న మాట. అయితే ఆయన్ని నమ్మడం ఎల్లకాలమూ అంత తేలిక కాకపోవచ్చు. ఈ వీడియోలో ఎందుకు దేవుడు ఎమెట్ తో నిండి ఉన్నాడో తెలుసుకుంటాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #నమ్మకత్వం

దేవుని స్వభావం: నమ్మకమైన ప్రేమ Loyal Love

కేసేద్ అనే హెబ్రీ మాట హెబ్రీ బైబిల్లో దేవుణ్ణి గురించిన వర్ణనలో అతి తరచుగా వాడిన పదం. వాస్తవానికి ఈ పదాన్ని ఇతర ఏ భాషలోకీ సరిగా అనువదించడం అసాధ్యం. ఈ మాట ప్రేమ, నమ్మకత్వం, ఔదార్యం, వీటన్నిటినీ కలగలిపిన బహు లోతైన భావం కలిగి ఉంది. ఈ మనోహరమైన హెబ్రీ పదాన్ని ధ్యానించడంలో మాతో కలిసి రండి, అది దేవుని స్వభావం గురించిన మన అవగాహనను ఏవిధంగా పెంపొందిస్తుందో తెలుసుకోండి. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #నమ్మకమైనప్రేమ

దేవుని స్వభావం: దీర్ఘ శాంతుడు Slow to Anger

దేవుడు దీర్ఘ శాంతుడు అని చెప్పడంలో అర్థం ఏమిటి? బైబిల్లో దేవుని కోపం మానవుని దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆయన న్యాయనిరతి, ప్రేమలలో నుండి పుట్టిన ఒక న్యాయమైన స్పందన. ఈ వీడియోలో మనం బైబిలు వృత్తాంతంలో దేవుని కోపం, న్యాయనిరతిలను పరిశోధించి అది అంతా మనల్ని యేసు వైపుకు ఎలా నడిపిస్తుందో గమనిస్తాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #దీర్ఘశాంతుడు

ప్రత్యక్షత Apocalyptic Literature

ఇది ఒక ప్రత్యక్షత! ఇంతకీ ఈ మాటకి సరైన అర్థం ఏమిటి? బైబిలంతా మానవ చరిత్ర అంతిమ దశకు చేరుకోవడం గురించిన కలలు, దర్శనాలతోనూ నిండి ఉంది. సాధారణంగా అవన్నీ తీవ్రమైన పోలికలతో, విచిత్రమైన గుర్తులతో నిండి ఉంటాయి. ఈ వీడియోలో బైబిలోని “అపోకలిప్సే” లేక “ప్రత్యక్షత” అంటే ఏమిటో తెలుసుకొని, ఈ సాహిత్యాన్ని మరింత జ్ఞానంతో, అంతర్ద్రుష్టితో చదవడం నేర్చుకుంటాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #ప్రత్యక్షత

కొత్త నిబంధన పత్రికల సాహిత్యం New Testament Letters

కొత్త నిబంధనలో ఆది క్రైస్తవ నాయకులు ప్రాచీన రోమను ప్రపంచంలోని యేసు అనుచరుల సమాజాలకు రాసిన 21 ఉత్తరాలు లేక పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలను జ్ఞానయుక్తంగా చదవడంలో వాటి చారిత్రిక నేపథ్యాన్ని నేర్చుకోవడం కూడా ఇమిడి ఉంది. ఆ ఉత్తరాలు ఎవరికీ రాయబడ్డాయి, వారు ఎక్కడ నివసించేవారు, ఆ ఉత్తరం రాయడానికి ప్రేరణ ఏమిటి? ఈ వీడియోలో ఈ ఉత్తరాలు అందించే జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగేలా ఈ ఉత్తరాల చారిత్రిక నేపథ్యం యొక్క విభిన్నమైన అంశాలను పరిశోధిస్తాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #కొత్తనిబంధనపత్రికలసాహిత్యం

సువార్త The Gospel

కొత్త నిబంధనలో నజరేయుడైన యేసును గూర్చిన నాలుగు జీవిత చరిత్రలు ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి “సువార్త” అని పిలిచారు. వీటిలో ప్రతి ఒక్కటీ సిలువ వేయబడి, తిరిగి లేచిన యేసు సకల రాజ్యాలకూ నిజమైన పరిపాలకుడు అన్న ఒక ప్రకటన రూపంలో దాని కథను చెప్పాయి. ఈ వీడియోలో ఈ వృత్తాంతాలు ఎందుకు రాయబడ్డాయి, వాటిని మరింత అంతర్ద్రుష్టి కోసం ఏవిధంగా చదవాలి అని నేర్చుకుంటాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #సువార్త

పద ధ్యానం: మార్తూస్–సాక్ష్యం Witness

బైబిల్లో “సాక్ష్యం” అనే మాట ఒక వ్యక్తిని లేక ఒక చర్యని వివరించడానికి వాడబడింది- అంటే ఒక వ్యక్తి ఒక సంఘటనను చూసి తాను చూసిన విషయం గురించి మాట్లాడడం. ఈ రోజుల్లో ఉన్నట్టుగానే ఈ పదం న్యాయ సంబంధమైన పదజాలంలో, ఇంకా దేవునితో ఒక అనుభవం గురించి వర్ణించే సందర్భాల్లో వాడబడుతుంది. అయితే సాక్ష్యం అనే మాట గురించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లేఖనాల్లోని వృత్తాంతాలను, మరి ముఖ్యంగా దేవుని ప్రజల పాత్రను అది ఎంతగా ప్రకాశింప జేసిందో అనేదే. ఈ వీడియోలో ఈ మాట మనల్ని సంభ్రమానికి గురి చేసే బైబిలు వృత్తాంతంలో ఎలాంటి పాత్ర పోషించిందో చూస్తాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #సాక్ష్యం

దేవుని స్వభావం: దయ Grace

బైబిల్లోని దేవుడు కృపామయుడు అని చెప్పడంలో అర్థం ఏమిటి? ఈ వీడియోలో కృప అనే మాటకి హెబ్రీ పదాలను చదివి మనం దేవుణ్ణి దృష్టించే విదానమలో అది ఎంత లోతైన భావాలను వెలిబుచ్చుతుందో అర్థం చేసుకుంటాం. కృప అనే పదానికి బైబిల్లోని భావాలను చూసి దేవుడు కృపామయుడు అని గ్రహించినప్పుడు అర్హత లేని ప్రజలకు కూడా ఉదారంగా బహుమానాలివ్వడానికి ఇష్టపడే వానిగా మనం దేవుణ్ణి కనుగొంటాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #కృప

దేవుని స్వభావం: దయాదాక్షిణ్యములు Compassion

దయాదాక్షిణ్యం అనేది ఒక లోతైన భావోద్రేకపూరితమైన పదం. ఒక తండ్రి/తల్లికి తమ పిల్లలతో ఉన్న బలమైన బంధం గురించి వివరిస్తుంది. ఈ వీడియోలో హెబ్రీ భాషలో అతి శ్రేష్టమైన ఈ పదం గురించి తెలుసుకుంటాం. నిర్గమ 34:6-7 లో దేవుడు తనను తాను వర్ణించుకున్న మాటల్లో ఇది మొదటిది. లేఖనమంతటిలో దేవుడు తనను ఒక దయాదాక్షిణ్యం గల తండ్రి/తల్లి గా వర్ణించబడ్డాడు. ఆయన దయ యేసు వ్యక్తిత్వంలో మూర్తీభవించింది. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #దయాదాక్షిణ్యములు

బైబిలును ఎలా చదవాలి: యేసు ఉపమానాలు The Parables of Jesus

నజరేయుడైన యేసు ఒక అద్భుతమైన కధకుడు. ఆయన చేసిన బోధలలో ఎక్కువ భాగం ఉపమానాల రూపంలో చెప్పబడ్డాయి. అయితే ఈ కథలు కేవలం “బోధించడం” కంటే మరింత అధికమైన ప్రయోజనం కలిగి ఉండేలా రూపొందించ బడ్డాయి. తన ఉపమానాలు దేవుని రాజ్యం రాక గురించిన సందేశాన్ని వెల్లడి చేయడానికీ, దానిని కప్పి ఉంచడానికి కూడా ఉద్దేశించబడ్డాయి అని యేసు చెప్పాడు. ఈ వీడియోలో మనం యేసు ఉపమానాల్లోని ప్రధానాంశాలు ఏమిటి, ఆయన ప్రాథమికంగా తన సందేశాన్ని అందించడానికి వాటిని ఎందుకు వాడాడో తెలుసుకుందాం. Original Content and Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India #BIbleProject #TeluguBibleVideos #బైబులువీడి

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

Access updates, news, Biblical teaching and inspirational messages from powerful Christian voices.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు