My360 Helper


నగరం

బైబిలు వృత్తాంతమంతటిలో కొనసాగిన నగరం అనే అంశం గురించి పరిశీలించండి – కయీను నిర్మించిన మొట్టమొదటి నగరం మొదలుకొని నూతన సృష్టిలోని పరలోక యెరూషలేము నగరం వరకు. #BIbleProject #TeluguBibleVideos #నగరం…ఎక్కువగా చదువు

అభిషేకం

అభిషేకం యొక్క ప్రయోజనం ఏమిటి? బైబిల్ అంతటా ఈ ఆచారాన్ని అర్థం చేసుకోవడానికి మా థీమ్ వీడియోను చూడండి మరియు అది యేసుకు మరియు ఆయన అనుచరులకు ఎలా సంబంధించినది. C #BIbleProject #TeluguBibleVideos #అభిషేకం

గందరగోళం డ్రాగన్

మానవశక్తులు, ఆధ్యాత్మిక శక్తులు కలిసి ఈ సృష్టి అంతటినీ ఒక క్రమరాహిత్యానికీ, మరణానికీ దిగజార్చిన విధానాన్ని వర్ణించడానికి బైబిలు రచయితలు డ్రాగన్ చిత్రాన్ని ఏవిధంగా వాడుకున్నారో పరిశీలించండి. #BIbleProject #TeluguBibleVideos #డ్రాగన్

కీర్తన 8

బైబిలు కథలో మానవుల అసలు పాత్ర ఏమిటి? శక్తిహీనులం, సృష్టించబడ్డ వారం అయిన మన గురించి దేవుడు ఎందుకు పట్టించుకోవాలి? కీర్తన 8 లో మనం చంటిబిడ్డలు అని ఎందుకు పోల్చబడ్డాము? ఈ వీడియోలో ఒక అద్భుతమైన బైబిలు కీర్తనను ధ్యానించడం ద్వారా మానవాళి పట్లా, ఈ సృష్టి అంతటి పట్లా దేవుని ఉద్దేశం గురించిన లోతైన అంతర్ద్రుష్టిని మనం పొందుతాం. #BIbleProject #TeluguBibleVideos #కీర్తన8

సామెతలు 8

బైబిలు కథలో దేవుడు ఈ లోకాన్ని పాలించడంలో తన ప్రతినిధులుగా మానవులను నియమించాడు. కానీ వారు మూర్ఖత్వాన్నీ, మరణాన్నీ ఎన్నుకొని ఆ మార్గం నుండి ఎలా తిరిగి రాగలరు? సామెతలు 8 లో దేవుని జ్ఞానం అని వర్ణించబడిన ఒక స్త్రీ ని కలుసుకొని ఆమె చూపే మార్గాలను నేర్చుకొని, జీవాన్ని కనుగొనండి. ఈ వీడియోలో మనం చదినే ఈ పద్యం మనం జీవించడానికి ఎవరి జ్ఞానాన్ని ఎంచుకుంటాం అనే విషయంలో ఒక ఎంపికను చేసుకొనేలా మనల్ని బలవంతం చేస్తుంది. #BIbleProject #TeluguBibleVideos #Proverbs

యోహాను 1

యోహాను తన సువార్త వృత్తాంతాన్ని దేవుడు తాను పలికిన మాట ద్వారా ఈ లోకంలో జీవాన్ని సృష్టించాడు అని వివరించిన ఆదికాండం ప్రారంభ అధ్యాయాలను ప్రతిధ్వనించే విధంగా యేసును దేవుని వాక్కుగా పరిచయం చేస్తూ ప్రారంభించాడు. ఈ ప్రారంభం బాగుంది కానీ దేవుడు సృష్టించిన జీవులు ఆయన ఆజ్ఞలను తిరస్కరించి సృష్టి యావత్తు మరణంలో దిగిపోయేలా చేశారు. ఈ లోకానికి ఒక కొత్త ప్రారంభం అవసరమైంది. కాబట్టి దైవిక వాక్కు మళ్ళీ పలికింది. అయితే ఈసారి అ వాక్కు యేసు అనే ఒక మానవునిగా దిగి వచ్చింది. #BIbleProject #TeluguBibleVideos #యోహాను1

ఆదికాండం 1

ఆదికాండం 1 లోని ప్రాచీన చారిత్రిక, సాంస్క్రుతిక సందర్బాన్ని పరిశీలించినప్పుడు దాని కథలోని వ్యాఖ్యానం ఎలా ఉంటుంది? ఈ బైబిలు వ్యాఖ్యాన వీడియోలో ఆదికాండం 1 లోని సాహితీ నిర్మాణం ఈ విశ్వమంతటికీ అవసరమైన దేవుని దర్శనాన్ని మనకు అందిస్తుంది. #BIbleProject #TeluguBibleVideos #Genesis

కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 10)

యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • “ఆకాశాల రాజ్యం” అంటే యేసు ఉద్దేశం ఏమిటి? • విశాలమైన, ఇరుకైన ద్వారాలు అనే ఉపమానం అర్థం ఏమిటి? • “గొర్రె చర్మాన్ని ధరించిన తోడేళ్ళను” గుర్తించడం ఎలా? రాతిమీద, ఇసుకమీద కట్టిన ఇళ్ళ గురించిన ఉపమానం అర్థం ఏమిటి? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం

కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 9)

యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • లేఖనాల్లో దేవుని జ్ఞానాన్ని వెదికేవారికి ఎదురయ్యే చిక్కుల గురించి. • ఇతరులకు తీర్పుతీర్చాలని అనిపించినప్పుడు మనం ఏమి చేయాలని యేసు బోధించాడు? • ఎదుటివారి కంటిలో నలుసును ఎత్తి చూపక ముందు నీ కంటిలోని దూలాన్ని తీసివేసుకోమని యేసు ఎందుకు చెప్పాడు? • “మీ ముత్యాలను పందుల ముందు వేయకండి” అని యేసు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? • “అడగండి, వెదకండి, తట్టండి” అని యేసు మనల్ని ఎందుకు ప్రోత్సహించాడు? ఆరోగ్యకరమైన సంబంధాలు ఎక్కడ ప్రారంభం అవుతాయి? #BIbleProject #TeluguBibleVideos #nameofvideos

కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 8)

యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • యేసు “ధననిధులు” అని చెప్పిన మాటకు అర్థం ఏమిటి? • యేసు ఈ భూమిపై ధనాన్ని సమకూర్చుకోవద్దని ఎందుకు చెప్పాడు? • “పరలోకంలో నిధులు” ఏమిటి? • “పరలోకంలో నిధులు” పోగుచేసుకోవడం ఎలా? • “దేహానికి దీపం కన్నే” అనే మాటలకు అర్థం ఏమిటి? • ఐశ్వర్యం, ఆస్తుల మీద మనసుపెట్టుకోవడంలో ప్రమాదం? మన అవసరాలను తీర్చుకోవడం గురించి యేసు ఏమి చెప్పాడు? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం Copyright by BibleProject Portland, Oregon, USA Telugu Localization by Diversified Media Pvt Ltd. Hyderabad, India

కొండ మీద ప్రసంగం (ఎపిసోడ్ 7)

యేసు చేసిన బోధనలలో ప్రసిద్ధి చెందిన కొండమీద ప్రసంగాలను పరిశీలించడంలో మాతో ఏకం కండి. ఈ వీడియోలో మీరు: • కొండమీద ప్రసంగంలో ప్రభువు నేర్పిన ప్రార్థన ఎక్కడ ఉంది? • దేవుణ్ణి యేసు ఎందుకు “మా తండ్రీ” అని పిలిచాడు? • దేవుని పేరును పరిశుద్ధమైనదిగా ఎందుకు గుర్తించాలి? • పరలోకంలో ఉన్న విధంగా దేవుని రాజ్యం ఈ భూమి మీదకు రావడం అంటే ఏమిటి? • “అనుదినాహారం” దేనిని సూచిస్తుంది? • మనం క్షమించిన రీతిగా క్షమాపణ పొందాలని ఎందుకు అడుగుతాం? ఎలాటి శోధన నుండి తప్పించబడాలని మనం కోరుకుంటున్నాం? #BIbleProject #TeluguBibleVideos #కొండమీదప్రసంగం

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు

This site is protected by reCAPTCHA, and the Google Privacy Policy & Terms of Use apply.